భోపాల్: మధ్యప్రదేశ్లోని మరో జిల్లాలో భిక్షాటనపై నిషేధం విధించారు. కొద్ది రోజుల క్రితం ఇండోర్ జిల్లాలో భిక్షాటనను నిషేధించగా తాజాగా భోపాల్తోపాటు జిల్లా వ్యాప్తంగా నిషేధం విధించారు. భిక్షాటన చేస్తూ యాచకులు కనపడినా, వారికి దానం చేస్తూ పౌరులు కనబడినా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.
భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163(2) కింద జిల్లావ్యాప్తంగా భిక్షాటననను నిషేధిస్తున్నట్టు భోపాల్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉండే యాచకులు క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నట్టు కనుగొన్నామని కలెక్టర్ పేర్కొన్నారు.