భోపాల్: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Bear Kills 3) మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దానిని కొట్టి చంపారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సంజయ్ గాంధీ టైగర్ రిజర్వ్ సమీపంలోని బస్తువా గ్రామంలో ఐదుగురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ముగ్గురు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఎలుగుబంటి దాడిలో ముగ్గురు చనిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. కర్రలతో దానిని వెంబడించారు. ఒక పొదలో దాగి ఉన్న ఎలుగుబంటిని కొట్టి చంపారు. దాని దాడిలో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు గాయపడిన సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతులను బబ్బు యాదవ్, దీన్‌బంధు సాహు, సంతోష్ యాదవ్‌గా గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Also Read:
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్
Himachal floods | కొట్టుకుపోయిన తల్లిదండ్రులు, అమ్మమ్మ.. ప్రాణాలతో బయటపడిన 11 నెలల పసి పాప