ECI | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాహుల్ వాదనలు నిరాధారమని, చట్ట నియమాలకు అవమానమని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల కమిషన్ 2024 డిసెంబర్ 24న కాంగ్రెస్‌కు పంపిన సమాధానంలో ఈ వాస్తవాలన్నింటినీ ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇలాంటి అంశాలను మళ్లీ మళ్లీ లేవనెత్తడం ద్వారా ఈ వాస్తవాలన్నింటినీ పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే అది చట్టంపై అగౌరవానికి సంకేతం మాత్రమే కాకుండా, వారి సొంత రాజకీయ పార్టీ నియమించిన వేలాది మంది ప్రతినిధుల ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ‘ఇది ఎన్నికల సమయంలో అవిశ్రాంతంగా, పారదర్శకంగా పనిచేసే లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని నిరాశ పరుస్తుంది. ఓటర్ల నుంచి ఏదైనా ప్రతికూల నిర్ణయం తర్వాత ఇలా చెప్పడం ద్వారా ఎన్నికల కమిషన్‌ను అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం’ అని పేర్కొంది.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఇదే తరహాలో త్వరలో బిహార్‌లో జరుగనున్న ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రిగ్గింగ్‌పై రాహుల్ రాసిన కథనాన్ని ఓ పత్రికలో పోస్టు చేశారు. ఆ పత్రిక రిపోర్టును ఆయన తన ఎక్స్‌లో షేర్ చేశారు. రిగ్గింగ్ ప్రజాస్వామ్యానికి 2024 మహారాష్ట్ర ఎన్నికలు బ్లూప్రింట్ అని, ఆ రిగ్గింగ్ ఎలా జరిగిందో ఈ ఆర్టికల్‌లో తెలుస్తుందన్నారు. ఐదు దశల్లో రిగ్గింగ్ జరుగుతుందని రాహుల్ పేర్కొన్నారు. తొలి దశలో ఎన్నికల సంఘంలో రిగ్గింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఎలక్టోరల్ రోల్‌కు నకిలీ ఓటర్లను జోడిస్తారని ఆరోపించారు. ఆ తర్వాత బోగస్ ఓట్ల ఆధారంగా బీజేపీ గెలుస్తుందని, ఆధారాలను దాచిపెడుతారని విమర్శించారు. రిగ్గింగ్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌తో పోల్చారు. చీటింగ్ చేసిన పార్టీ గెలుస్తుందని, కానీ దాని వల్ల వ్యవస్థలన్నీ నష్టపోతాయన్నారు. ప్రజల్లో విశ్వాసం నాశనం అవుతుందన్నారు. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ .. త్వరలో బీహార్ ఎన్నికల్లో జరుగ బోతోందన్నారు. మ్యాచ్ ఫిక్స్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్య దేశానికైనా విషం లాంటిందని వ్యాఖ్యానించారు.
Read Also :
Encounter | బీజాపూర్ నేషనల్‌పార్కులో మరో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మంచి మనసు.. ముంబై ఐసీటీకి గురుదక్షిణగా రూ.151 కోట్ల విరాళం