న్యూఢిల్లీ: ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో పవర్‌బ్యాంక్ పేలి.. మంటలు చెలరేగిన ఘటన సంచలనం రేపింది. ఆ బ్యాగ్‌లో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ వల్లే ఈ ఘటన జరిగిందని దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో విమానాల్లో పవర్బ్యాంక్ల వాడకంపై ‘డీజీసీఏ’(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిషేధం విధించబోతున్నట్టు తెలిసింది. ప్రయాణికులు తమ వెంట పవర్‌బ్యాంక్‌లను తీసుకురావటంపై కఠినమైన నిబంధనల్ని తీసుకురావాలని భావిస్తున్నది.