Bank Holidays | కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ (April) నెలకు సంబంధించిన సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. కాగా, ఆ నెలలో పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఆర్బీఐ (RBI) సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.
ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం.. ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా..
ఏప్రిల్ 1: 2022-2023 ఆర్థిక సంవత్సరం మార్చి చివరకు ముగుస్తుంది. బ్యాంకులు వార్షిక మూసివేత కారణంగా ఏటా ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ఉటుంది.
ఏప్రిల్ 2: ఆదివారం
ఏప్రిల్ 4: మహావీర్ జయంతి
ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 8: రెండవ శనివారం
ఏప్రిల్ 9: ఆదివారం
ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరం (అగర్తలా, గౌహతి, కోల్కతా బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 16: ఆదివారం
ఏప్రిల్ 18: షాబ్-ఎ-క్వార్డ్ (జమ్మూ, కాశ్మీర్లో బ్యాంకులకు సెలవు).
ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్)
ఏప్రిల్ 22: నాలుగో శనివారం
ఏప్రిల్ 23: ఆదివారం
ఏప్రిల్ 30: ఆదివారం
Also Read..
Jack Ma | ఏడాదిన్నర తర్వాత.. చైనాలో ప్రత్యక్షమైన అలీబాబా ఫౌండర్ జాక్ మా
Shikhar Dhawan | హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నా : శిఖర్ ధావన్