Parineeti Chopra | ఎంపీతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో.. డిజైనర్ ఇంటికెళ్లిన పరిణీతి.. అందుకే అంటున్న నెటిజన్లు..?
Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha), బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పరిణీతి ప్రముఖ డిజైనర్ (designer) మనీశ్ మల్హోత్ర (Manish Malhotra) ఇంటికి వెళ్లడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది.
Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha), బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి వరుసగా డిన్నర్ డేట్ (Dinner Dates), లంచ్ మీటింగ్స్ (Lunch Meets) అంటూ చట్టాపట్టాలేసుకు తిరిగిన ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారంటూ పలు వెబ్సైట్లలో సైతం వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అలా అని కొట్టిపారేయలేదు కూడా.
డేటింగ్ రూమర్స్‌పై ఎంపీ రాఘవ్ చద్దాను ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘రాజనీతి (రాజకీయాల) గురించి అడగండి.. పరిణీతి గురించి కాదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పరిణీతి ప్రముఖ డిజైనర్ (designer) మనీశ్ మల్హోత్ర (Manish Malhotra) ఇంటికి వెళ్లడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది.
మనీశ్ మల్హోత్ర ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ డిజైనర్లలో ఒకరన్న విషయం తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు వివాహానికి మనీశ్.. అందమైన దుస్తుల్ని డిజైన్ చేసిచ్చారు. ఈ నేపథ్యంలో మనీశ్ ఇంటికి పరిణీతి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం ముంబయిలోని డిజైనర్ ఇంటికి నటి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నటి త్వరలోనే ఎంపీని వివాహం ఆడబోతోందని, పెండ్లి దుస్తులు డిజైన్ చేయించుకునేందుకే మనీశ్ మల్హోత్ర ఇంటికి వెళ్లిందంటూ చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.
Also Read..
Rahul Gandhi | నిజం, ధైర్యం, త్యాగం.. ఇదీ మా వారసత్వం : రాహుల్ గాంధీ
Uddhav Thackeray | సావర్కర్‌పై కీలక వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఉద్ధవ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Tejashwi Yadav | లాలూ ఇంట సందడి వాతావరణం.. తండ్రైన తేజస్వీ యాదవ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

