Rahul Gandhi | నిజం, ధైర్యం, త్యాగం.. ఇదీ మా వారసత్వం : రాహుల్ గాంధీ
Rahul Gandhi | ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ట్విట్టర్ బయో (Twitter Bio) ని ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ (disqualified mp)గా మార్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
Rahul Gandhi | ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ట్విట్టర్ బయో (Twitter Bio) ని ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ (disqualified mp)గా మార్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.
2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ (Congress) పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ (Sankalp Satyagraha) దీక్షలు చేపట్టింది. ఢిల్లీ (Delhi) లోని రాజ్‌ఘాట్ (Rajghat) వద్ద చేపట్టిన దీక్షలో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని మోస్తూ రాహుల్ ఆర్మీ ట్రక్కు వెనుక నడిచిన సంఘటనను గుర్తు చేస్తూ ప్రియాం ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
‘32 ఏళ్ల క్రితం, మా నాన్న (రాజీవ్ గాంధీ) మృతదేహం అంత్యక్రియల కోసం తీన్‌మూర్తి భవన్ నుంచి బయలుదేరుతోంది. మృతదేహాన్ని మోస్తూ రాహుల్ నడి ఎండలో ఆర్మీ ట్రక్కు వెనకే నడిచారు. అప్పుడు మా నాన్న మృతదేహానికి త్రివర్ణ పతాకం చుట్టారు. కానీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్నను మీరు అవమానించారు. ఇప్పుడు ఆ అమరవీరుడి కుమారుడిని దేశద్రోహి అంటున్నారు. అతని దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ ఇంటిపేరును ఈ కుటుంబం ఎందుకు ఉపయోగించలేదని పార్లమెంటులో ప్రధాని ఎద్దేవా చేశారు. అలా ప్రశ్నించి మీరు మా మొత్తం కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానించారు’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ వీడియో షేర్ చేసిన రాహుల్.. ‘నిజం, ధైర్యం, త్యాగం – ఇది మా వారసత్వం. ఇదే మా బలం కూడా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Also Read..
Uddhav Thackeray | సావర్కర్‌పై కీలక వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఉద్ధవ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Tejashwi Yadav | లాలూ ఇంట సందడి వాతావరణం.. తండ్రైన తేజస్వీ యాదవ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

