Uddhav Thackeray | సావర్కర్‌పై కీలక వ్యాఖ్యలు.. రాహుల్‌కు ఉద్ధవ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Uddhav Thackeray | సావర్కర్ (Savarkar)ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) హెచ్చరించారు.
Uddhav Thackeray | సావర్కర్ (Savarkar)ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) హెచ్చరించారు. రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పేరు సావర్కర్ (Savarkar) కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది’ అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై తాజాగా ఉద్ధవ్ స్పందించారు.
సావర్కర్‌ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ‘హిందుత్వ సిద్ధాంతాల విషయంలో సావర్కర్ మాకు స్ఫూర్తి. ఆయన్ని మేము ఆరాధ్య దైవంగా భావిస్తున్నాం. సావర్కర్‌ని అవమానించకండి. సావర్కర్ 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులర్ జైల్లో ఊహకందని చిత్రహింసలను అనుభవించాడు. అది త్యాగానికి ప్రతిరూపం. అలాంటి సావర్కర్‌ను అవమానిస్తే మేం భరించలేము. సావర్కర్ విషయంలో పోరాటం చేయడానికి అయినా మేం సిద్ధం. ఆయన గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే విపక్ష కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది’ అని ఠాక్రే హెచ్చరించారు.
‘నేను రాహుల్ గాంధీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేము కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితో జత కట్టాము. ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. చీలికలు సృష్టించే ఎటువంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయొద్దు. వారు (బీజేపీ) ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో కలిసి పోరాడాల్సి ఉంది. మనం ఈ సమయాన్ని కోల్పోతే.. మన దేశం ఖచ్చితంగా నిరంకుశత్వం వైపు వెళ్తుంది’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
Also Read..
Tejashwi Yadav | లాలూ ఇంట సందడి వాతావరణం.. తండ్రైన తేజస్వీ యాదవ్
India Corona | దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియోకాన్ఫరెన్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

