Tejashwi Yadav | ఆర్జేడీ (RJD) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Yadav) ఇంట సందడి వాతావరణం నెలకొంది. లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి (Bihar Deputy CM) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తొలిసారి తండ్రయ్యారు. ఆయన భార్య రాజశ్రీ (Rajashri) పండంటి ఆడబిడ్డకు (Baby Girl) జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను తేజస్వీ యాదవ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
‘దేవుడు సంతోషించి, కూతురి రూపంలో బహుమతి పంపాడు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తొలిసారి తల్లిదండ్రులైన తేజస్వీ దంపతులకు ఆర్జేడీ నేతలతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, తేజస్వీ యాదవ్.. చిన్న నాటి స్నేహితురాలైన రాజశ్రీని 2021 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. రాజశ్రీ హర్యానాలోని రేవారీకి చెందినవారు. కాగా.. ఆమె చిన్నతనం నుంచి ఢిల్లీలోనే నివసించేవారు. తేజస్వీయాదవ్, రాజశ్రీ ఢిల్లీలోని ఆర్ కె పురంలోని డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.
ईश्वर ने आनंदित होकर पुत्री रत्न के रूप में उपहार भेजा है। pic.twitter.com/UCikoi3RkM
— Tejashwi Yadav (@yadavtejashwi) March 27, 2023
Also Read..
Innocent | సినీ పరిశ్రమలో విషాదం.. మలయాళ హాస్యనటుడు మృతి
Gurudwara | గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు