న్యూఢిల్లీ: బీహార్‌లోని ఓటర్ల జాబితాపై చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డుల్లో తేడాలు గుర్తించిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల పౌరులు కూడా భారత ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
బీహార్‌లో ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ నుంచి వచ్చిన చాలామందికి ఆధార్, నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు వంటి పత్రాలు ఉన్నట్టు బూత్ లెవెల్ ఆఫీసర్లు గుర్తించారు.