బెంగళూరు: బీజేపీ నేతల ఆందోళన కార్యక్రమ ఫొటో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్న కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానిక ప్రత్యేక కోర్టు బెంగళూరు పోలీసులను ఆదేశించింది.
శ్రీకాంత్ అనే కరసేవక్ అరెస్టుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన నిర్వహించింది. ‘నేను కూడా కరసేవక్‌నే, నన్నూ అరెస్టు చేయండి’ అని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించారు. అయితే దాన్ని కాంగ్రెస్ ఐటీ సెల్ మార్ఫింగ్ చేసి.. స్కామ్‌లు, అక్రమాల ఒప్పుకోలు స్టేట్మెంట్లాగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేసిందని బీజేపీ ఆరోపించింది. ఇదే మార్ఫింగ్ ఫొటోనే డీకే సోషల్ మీడియా ఖాతా నుంచి కూడా షేర్ అయింది. దీనిపై బీజేపీ కోర్టులో ఫిర్యాదు చేసింది.