కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ద్విచక్ర వాహనాల వినియోగంపై ఎన్నికల సంఘం కఠిన పరిమితులు విధించింది. రాత్రి పూట బైకుల సంచారాన్ని నిషేధించడంతో పాటు ఏ పార్టీ కూడా బైక్ ర్యాలీలు నిర్వహించ రాదని, పగలు డబుల్స్ ప్రయాణం చేయరాదని పేర్కొంటూ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.
స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, కుటుంబ వేడుకలు, పిల్లలను స్కూల్లో దింపడం, తీసుకుని రావడం వంటివాటికి మినహాయింపు ఇచ్చింది.