న్యూఢిల్లీ, అక్టోబర్ 18: మనీ లాండరింగ్ కేసులో దాదాపు రెండేండ్ల తర్వాత ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణలో జాప్యం, సుదీర్ఘకాలం విచారణ ఖైదీగా ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. తనకు సంబంధించిన నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను 2022 మే 30న అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా విచారణ సాగుతున్నదని, నిందితుడు 18 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నందున అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జడ్జి విశాల్ గోగ్నే తెలిపారు.