తిరువనంతపురం: కేరళలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెదురుమొదురు వానలు పడుతుండగా.. శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శబరి కొండ కింద పంబా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. నది ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు శబరి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రోజు భక్తులెవరినీ పథనంతిట్టలోని అయ్యప్ప క్షేత్రానికి ( AYYappa Temple ) అనుమతించడంలేదు.
పథనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. భారీ వర్షాలు వరదల దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులను ఇవాళ అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతించడం లేదని, అయితే ఇప్పటికే బేస్ క్యాంప్‌కు చేరుకున్న వారిని మాత్రం దైవ దర్శనానికి అనుమతిస్తున్నామని ఆమె చెప్పారు.
Kerala: Due to continuous rainfall in Pathanamthitta pilgrimage to Sabarimala is prohibited for today ( 20th November): Divya S Iyer, District Collector pic.twitter.com/UDLAQUroG7
— ANI (@ANI) November 20, 2021