Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించింది. దాంతో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయడానికి ఒప్పందం చేసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ విషయంలో స్పందన చెప్పాలని కేంద్రంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర జాబితాలోని 1,2, 18 ఎంట్రీల కింద కేంద్ర అధికారాలు పరిమితమని సింఘ్వి వాదించారు. అయితే హైకోర్టు తన ఉత్తర్వులో ఆరోగ్య రంగంలో ప్రభుత్వ అధికారాలను పునర్నిర్వచించిందని.. కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ ప్రభుత్వం రాజీ పడాలని హైకోర్టు ఒత్తిడి చేస్తోందని సింఘ్వి వాదించారు.
2017లో ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాంట్లో ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసీయూలు, వెంటిలేటర్ల లభ్యతపై ఆందోళన వ్యక్తం వ్యక్తం చేశారు.
ఆ పిటిషన్లో పీఎం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య ఓ ఒప్పందం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం జాతీయ ఆరోగ్య మిషన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. పీఎం ఆయుష్మాన్ భారత్ పథకంలో భారీ జరిగిందని మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్రంలో ప్రభుత్వం మారక దర్యాప్తు జరిపతే భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.