శ్రీరామ జన్మభూమి అయోధ్య ఆదివారం మిరుమిట్లు గొలిపే దీపాల కాంతులతో కళకళలాడింది. ఛోటీ దివాలీ పేరుతో ఆదివారం నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సంప్రదాయ మట్టి ప్రమిదలలో 26,17,215 నూనె దీపాలను ఏర్పాటు చేశారు. దీనికి మొదటి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది.
అదే విధంగా, 2,128 మంది వేదాచార్యులతో సరయూ నదికి ఇచ్చిన హారతికి రెండో గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది. ఈ సర్టిఫికెట్లను యోగి ఆదిత్యనాథ్ స్వీకరించారు. దీంతో అయోధ్య వరుసగా తొమ్మిదో సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.