Ram Mandir Prasad | ఏడు రకాల పదార్థాలతో అయోధ్య రామమందిరం మహాప్రసాదం..!
Ram Mandir Prasad | రామమందిర ప్రారంభోత్సవానికి విచ్చేసే వీఐపీలకు నిర్వాహకులు మహాప్రసాదాన్ని అందజేయనున్నారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకకు తరలివచ్చిన 7 వేల మంది ప్రముఖులకు ఈ మహాప్రసాదాన్ని అందజేయనున్నారు.
Ram Mandir Prasad | లక్నో : రామమందిర ప్రారంభోత్సవానికి విచ్చేసే వీఐపీలకు నిర్వాహకులు మహాప్రసాదాన్ని అందజేయనున్నారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకకు తరలివచ్చిన 7 వేల మంది ప్రముఖులకు ఈ మహాప్రసాదాన్ని అందజేయనున్నారు. ఈ మహాప్రసాదంలో మొత్తం ఏడు రకాల పదార్థాలను ఉంచారు. బంగాళాదుంప చిప్స్, రామ్దానా లడ్డూ, నువ్వుల లడ్డూ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, మఖానా(తామర గింజలు) ఉన్నాయి. ఈ మహా ప్రసాదాన్ని 20 వేలకు పైగా ప్యాకెట్లలో సిద్ధం చేశారు.
200 మంది గుజరాత్కు చెందిన భాగవ సేన భారతి గార్వి, సంత్ సేవా సంస్థాన్లు ఈ మహాప్రసాదాన్ని తయారు చేస్తున్నాయి. అలాగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసే సాధువులు, ఇతరులకు బస, భోజన ఏర్పాట్లను చేసినట్టు ట్రస్ట్ తెలిపింది. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని ప్రతి రోజు 5 వేల మందికి అందిస్తామని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

