Awantipora Encounter | జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఎన్కౌంటర్లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్ (JeM) కమాండర్ ఖైజర్ కోకాగా గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. కోకా 2018 నుంచి దక్షిణ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడని పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదుల గురించి పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ మొదలైంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 6న లష్కరే తోయిబాకు (LeT)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఉగ్రవాదులు ఖైమోలోని రెషిపురాకు చెందిన నదీమ్ అబ్బాస్ భట్, మిర్పురా నివాసి కఫీల్ మీర్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.