లద్దాఖ్, సెప్టెంబర్ 9: కేంద్రం పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌లో హఠాత్తుగా సంభవించిన హిమపాతానికి ముగ్గురు సైనికులు మరణించారు. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్‌లో ఆదివారం ఏర్పడిన ఈ హిమపాతంలో ముగ్గురు మృతి చెందారు.
వీరిలో ఇద్దరు అగ్నివీరులు కూడా ఉన్నారని మంగళవారం అధికారులు తెలిపారు. మంచులో కూరుకుపోయిన ముగ్గురు సైనికుల మృతదేహాలను వెలికితీశామని వారు చెప్పారు.