న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పంజాబ్‌లోని పటియాలకు సమీపంలో రైల్వే ట్రాక్‌పై సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. శంభు-అంబాల రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ ఘటన కుట్రపూరిత యత్నమని పోలీసులు భావిస్తున్నారు. పేలుడుకు యత్నించిన వ్యక్తి ఆ ఘటనలోనే ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, పేలుడు ఘటనకు ఈ మృతదేహానికి సంబంధముందా? అన్నది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు, రైల్వే శాఖకు సంబంధించి వివిధ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును చేపట్టాయి.