న్యూఢిల్లీ: ఇండియా-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విచ్చలవిడిగా హల్చల్ చేస్తున్నాయి. అందులో ఏటీఎంలు మూతపడబోతున్నాయన్న వార్త ఒకటి. దీనిపై భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు స్పందించాయి.
ఆ ప్రచారంలో నిజం లేదని, ఏటీఎంలు, సీడీఎంలు/ఏడీడబ్ల్యూఎంలు య థావిధిగా పనిచేస్తున్నాయని తెలిపాయి. డిజిటల్ సర్వీసులు కూడా ఎలాంటి విఘాతం లేకుండా కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి.