Atiq Ahmed Case | గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై ప్రశ్నలు లేవనెత్తిన సుప్రీంకోర్టు..!
Atiq Ahmed Case | గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దాఖలపై పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది.
Atiq Ahmed Case | గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దాఖలపై పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా హత్య కేసులో తీసుకున్న చర్యలు, గాయాలకు సంబంధించి సమగ్రంగా అఫిడవిట్‌ను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ సర్కారును కోర్టు ఆదేశించింది. దాంతో పాటు ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ నెల 13న మరణించిన అతీక్ తనయుడు అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన నివేదికను సైతం కోరింది. ఆ తర్వాత రెంటు రోజులకు అతీఖ్ అహ్మతో పాటు అతని సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు వ్యక్తులు మీడియా ప్రతినిధులుగా వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
పోలీసుల బందోబస్తు మధ్య ఆరోగ్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తరలిస్తున్న సమయంలో కాల్పులు జరిపారు. విచారణ సందర్భంగా కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. యూపీ సర్కారు తరఫున ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. అయితే, అతీక్ సోదరులను ఎందుకు కారులో ఎందుకు ఆసుప్రతికి తీసుకెళ్లలేదని, ఎందుకు నడిపించుకొని తీసుకువెళ్లారని ప్రశ్నించింది. ఈ చర్యకు గల కారణాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017 నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 183 ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

