Congress Politics | ఒక ఫ్యామిలీ.. ఒక టికెట్.. కానీ గాంధీలకు..!
Congress Politics | బుధవారం నుంచి ఉదయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ చింతన్ శివిర్‌లో.. ఒక ఫ్యామిలీ-ఒక టిక్కెట్‌పైనే చర్చిస్తారు.
Congress Politics | ఒక ఫ్యామిలీ- ఒక టికెట్ నిబంధనపైనే కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బుధవారం నుంచి మూడు రోజులు సాగే చింతన్ శివిర్లోనూ దీనిపైనే ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. చింతన్ శిబిర్ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చ జరిగిన అంశాల్లో ఇదొకటని వినికిడి. అయితే, గాంధీ కుటుంబానికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో పరాజయాల పరంపర నుంచి విజయాల దిశగా పార్టీని మళ్లించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ చింతన్ శివిర్‌లో చర్చిస్తారని భావిస్తున్నారు.
సమిష్టి విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా పార్టీ పార్లమెంటరీ బోర్డు పునరుద్ధరించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు. ద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరుకు అన్ని విపక్షాలతో పొత్తుకు చింతన్ శివిర్ పిలుపు ఇవ్వనుందని తెలుస్తున్నది.
పెరిగిపోతున్న జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగంపై దృష్టి పెట్టడంతోపాటుఇటీవలి ఎన్నికల్లో మాదిరిగా విభజనపూరిత, మతతత్వ ప్రచారోద్యమాన్ని అనుమతించొద్దని పార్టీ వర్గాలు చెబతున్నాయి. ఎన్నికల ప్రచారం, సమన్వయం కోసం విడిగా ఎలక్షన్ వింగ్ ఏర్పాటు చేయాలని, దానికి ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడ్ని నియమించాలన్న సూచన వచ్చింది. 50 ఏండ్ల లోపు వయస్సు గల నేతలకు పార్టీ పదవుల్లో సగం అప్పగించే అంశాన్ని చర్చించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

