Cesarean Delivery | న్యూఢిల్లీ: దేశంలో ఐదు వంతులకు పైగా ప్రసవాలు సిజేరియన్(సి సెక్షన్) ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రైవేట్ దవాఖానలలోనే జరుగుతున్నట్లు లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ఈస్ట్ ఏషియా జర్నల్ జరిపిన తాజా అధ్యయనం వెల్లడైంది. సహజ కాన్పుకు బదులుగా ఆపరేషన్ చేసి శిశువును తీయడాన్ని సిజేరియన్గా వ్యవహరిస్తారు.
భారత్‌లో సిజేరియన్ ప్రసవాలు 21.5 శాతం ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. సిజేరియన్ డెలివరీలు నాగాలాండ్‌లో 5.2 శాతం ఉండగా, తెలంగాణలో 60.7 శాతం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.