న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఒక పారిశుధ్య కార్మికుడిపై దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ పబ్లిక్ టాయిలెట్లను గురువారం సందర్శించారు. టాయిలెట్‌కు తాళం వేసి ఉండటంపై అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికుడిపై మండిపడ్డారు. అంతేగాక ఆ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఆ దళిత పారిశుధ్య కార్మికుడి చెంపపై కొట్టారు.
కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఆ ఆక్రోశాన్ని దళిత పారిశుధ్య కార్మికులపై చూపుతున్నదని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆప్ నేత రాఖీ బిర్లా డిమాండ్ చేశారు.
మరోవైపు పారిశుధ్య కార్మికుడితో గొడవ జరిగినప్పుడు తాను దూరంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ తెలిపారు. స్లమ్ ఏరియాలో నివసించే వారి కోసం కట్టిన టాయిలెట్‌ను లాక్ చేయడం గురించి తనకు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. దీనిపై పారిశుధ్య కార్మికుడ్ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని, తాళం చెవి తన వద్ద లేదని తొలుత బుకాయించాడని ఆయన ఆరోపించారు. స్థానికులు గట్టిగా నిలదీయగా అప్పుడు టాయిలెట్ తాళం తెరిచినట్లు తెలిపారు. అందులో మద్యం బాటిళ్లను నిల్వ చేసినట్లు ఆయన ఆరోపించారు.
BJP ने राजनीति को घृणा की राजनीति में परिवर्तित कर दिया है। लक्ष्मी नगर के विधायक @abhayvermabjp ने MCD के एक ऑन ड्यूटी कर्मचारी से बदतमीजी और हाथापाई की। BJP की इस गुंडागर्दी के खिलाफ अब हमें मिलकर कदम उठाना होगा।@AAPDelhi @AamAadmiParty pic.twitter.com/EHb40gHpGF
— MLA Kuldeep Kumar (@KuldeepKumarAAP) December 29, 2022