కియోంఝర్: ఒడిశాలో బీజేడీ పాలనా కాలంలో తనపై బాంబులు వేసి, హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత మోహన్ చరణ్ మాఝీ సోమవారం ఆరోపించారు. తన సొంత జిల్లా కియోంఝర్లోని ఝుంపురలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ ఆరోపణ చేశారు.
మండువలో బాంబు దాడి చేసి, తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, అయితే భగవంతుని ఆశీర్వాదాలు, ప్రజల ప్రేమాభిమానాలు తనను కాపాడాయని చెప్పారు.