న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశంలో అన్ని రాష్ర్టాల కంటే అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చింది. దేశంలో మద్యపాన వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఈశాన్య రాష్ర్టాల్లో మద్యపానం ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది. దేశ వ్యాప్తంగా 15-49 ఏండ్ల వయస్సు గల మహిళల్లో మద్యపానం 1.2 శాతం ఉండగా, అస్సాంలో ఈ సగటు 16.5 శాతంగా నమోదైంది. అస్సాం తర్వాత రెండో స్థానంలో మేఘాలయ నిలిచింది. ఇక్కడ 8.7 శాతంగా ఉంది.