గువాహటి, జనవరి 28: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ డూప్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని హిమంత తెలిపారు.
రాహుల్ డూప్ పేరేంటి, అతని చిరునామా, అతడిని ఎందు కు, ఎలా వినియోగిస్తున్నారు తదితర వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తానని, దీనికి కొన్ని రోజులు ఆగాలని విజ్ఞప్తి చేశారు. తాను రెండు రోజుల పర్యటన నిమిత్తం డిబ్రూగర్ వెళ్తున్నానని, అక్కడి నుంచి వచ్చిన వెంటనే వివరాలు తెలియజేస్తానని చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ పోలికలతో ఉన్న వ్యక్తిని ఆయన తన భారత్ జోడో న్యాయ యాత్రలో తనకు బదులుగా ఉంచుతున్నారని ఇటీవల హిమంత ఆరోపించిన విషయం తెలిసిందే.