గువాహటి, జూన్ 13: అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను పొందకుండా నిరోధించేందుకు 18 ఏండ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయకూడదని తన మంత్రివర్గం నిర్ణయించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు.
అసాధారణ సందర్భాల్లో ఆధార్ కార్డును జారీ చేయడానికి అనుమతి కోరుతూ జిల్లా కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని చెప్పారు. ఆ దరఖాస్తుదారు కార్డు పొందడానికి అర్హుడా? కాదా? అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.