Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై బీజేపీ (BJP) మండిపడింది. ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టును రాహుల్‌గాంధీగానీ, కాంగ్రెస్ పార్టీగానీ అభినందించకపోవడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pak Army chief) అసిమ్ మునీర్ (Asim Munir) కు రాహుల్‌గాంధీ బెస్ట్ ఫ్రెండ్ (Best friend) అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ (Pradeep Bhandari) విమర్శించారు.
ఒకవైపు క్రీడా యుద్ధరంగంలో పాకిస్థాన్‌పై భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించి టైటిల్ గెలిచినా రాహుల్‌గాంధీగానీ, కాంగ్రెస్ పార్టీగానీ కనీసం అభినందనలు తెలియజేయలేదని, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు భారత క్రికెటర్లు పాకిస్థానీ క్రికెటర్ల విషయంలో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదని విమర్శిస్తున్నారని భండారీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్థాన్నే ఎందుకు సపోర్టు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక పోస్టు పెట్టారు.
నాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్నే సపోర్టు చేసిందని, ఇప్పుడు అపరేషన్ తిలక్ సమయంలోనూ పాకిస్థాన్నే సపోర్టు చేస్తున్నదని భండారి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌కు బీ-టీమ్ అని విమర్శించారు.