పాట్నా: సుమారు 187 ఎకరాల స్థలంలో రూ.1,264 కోట్ల అంచనాతో పదేండ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన బీహార్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)-దర్భంగా కేవలం మెయిన్‌గేట్ పిల్లర్ నిర్మాణం మాత్రమే పూర్తి చేసుకుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. పదేండ్లలో కేవలం మెయిన్‌గేట్ పిల్లర్ ఒక్కటే నిర్మాణం పూర్తయింది.
ఎయిమ్స్ నత్తనడక నిర్మాణంపై విపక్ష కాంగ్రెస్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నది. ఆ సైట్‌కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. పునాదుల దశలో ఉన్న దర్భంగా ఎయిమ్స్‌లో ఏకంగా చికిత్సలే జరుగుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో అసత్య ప్రచారం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశిత్నాథ్ తివారీ ఆరోపించారు. ప్రధాని ప్రకటనలను ఎగతాళి చేస్తూ.. మోదీ అబద్ధాలను వెల్లడించడానికే ఈ ఫొటోలను తాము విడుదల చేస్తున్నామన్నారు.