బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 16:33:50

'ర్యాపిడ్' ప‌రీక్ష‌ల క‌చ్చిత‌త్వం ఎంత‌?

'ర్యాపిడ్' ప‌రీక్ష‌ల క‌చ్చిత‌త్వం ఎంత‌?

న్యూఢిల్లీ: ‌దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు న‌మోద‌య్యే కొత్త కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ది. దీంతో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ శాంపిల్స్ ప‌రీక్షించాల్సిన అస‌వ‌రం ఏర్ప‌డింది. దీంతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ విధానంలో క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అయితే, ఈ ప‌రీక్ష‌ల ద్వారా కొన్ని త‌ప్పుడు ఫ‌లితాలు కూడా వెల్ల‌డ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్‌ను గుర్తించ‌డంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ క‌చ్చిత‌త్వాన్ని అంచ‌నా వేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్)ను కోరింది. 

దేశ‌వ్యాప్తంగా రోజుకు ఎన్ని శాంపిళ్ల‌ను ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ విధానంలో ప‌రీక్షిస్తున్నారు? అందులో ఎన్ని శాంపిళ్ల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నా నెగెటివ్ రిపోర్టు వ‌స్తున్న‌ది? వారికి ఆర్‌టీ-పీసీఆర్ విధానంలో తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ నుంచి పాజిటివ్‌కు మారిన న‌మూనాల స‌గ‌టు శాతం ఎంత‌? అనే గ‌ణాంకాల ఆధారంగా ర్యాపిడ్ యాంటీజెన్ ప‌రీక్ష‌ల క‌చ్చిత‌త్వాన్ని విలువ క‌ట్టాల‌ని కేంద్రం కోరింది. 

కాగా, దేశ‌వ్యాప్తంగా సేక‌రించే అన్ని శాంపిళ్ల‌ను ప‌ర‌గణ‌లోకి తీసుకుని ఐసీఎమ్మార్ ర్యాపిడ్ యాంటీజెన్ ప‌రీక్ష‌ల క‌చ్చిత‌త్వాన్ని అంచ‌నా క‌ట్ట‌నుంది. ఆ ప‌రీక్ష‌ల్లో ఏమైనా లోపాలు ఉంటే స‌రిచేయాల్సి ఉంటుంది. ఒక్క‌సారి లోపాల‌ను స‌రిదిద్దితే ఇకపై మ‌నంచేసే ప‌రీక్ష‌ల్లో న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య క‌చ్చిత‌మైనద‌ని న‌మ్మ‌వ‌చ్చు.                     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo