Asaduddin Owaisi | పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఓ విలేకరి షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు ఒవైసీ సమాధానమిస్తూ.. అతనెవరు ? ఇది ఒక డ్రామా. నా ఎదుట జోకర్ల పేర్లను ఎందుకు తీసుకువస్తున్నారంటూ’ వ్యాఖ్యానించారు. దేనికి పనికి రానివాళ్ల గురించి మాట్లాడడం దండగ అంటూ చురకలంటించారు. పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘గ్రే లిస్ట్’లో ఉంచాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో నిర్ణయించుకోవాలన్నారు. పాకిస్తాన్‌ను మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో పెట్టాలన్నది తన డిమాండ్ అని.. ఇది అవసరమన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచుతోందని మండిపడ్డారు. అయితే, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ భారత్‌పై విషం కక్కాడు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదని చెప్పాడు. పాకిస్తాన్‌పై నిందలు వేకుండా దాడి ఉగ్రదాడికి సంబంధించి సాక్ష్యాలను చూపాలని విమర్శించారు. భారత్ తనను తానే నిందించుకోవాలని.. అక్కడ పటాకులు పేలినా.. పాకిస్తాన్‌పై నిందలు వేయాలంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. అలాగే, భారత మీడియాపై అక్కసును వెళ్లగక్కాడు. దాడి జరిగిన గంటలోపే మీడియా బాలీవుడ్‌గా మారడం ఆశ్చర్యకరమని.. ప్రతిదీ బాలీవుడ్‌గా మార్చొద్దని.. మీడియా చెప్పే విషయాలను చూసి ఆశ్చర్యపోయానంటూ వ్యాఖ్యానించాడు. ప్రతీ టీవీ చానెల్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే పాకిస్తాన్‌ను నిందిస్తున్నారన్నాడు. అంతటితో ఆగకుండా భారత సైన్యం గురించి సైతం అసంబద్ధమైన, నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు.