న్యూఢిల్లీ: పహల్గాం దాడికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను పిలవకపోవడం పట్ల ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది బీజేపీ అంతర్గత సమావేశం కాదని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలకు బలమైన, ఐక్య సందేశాన్ని ఇచ్చే సమావేశమని చెప్పారు. అలాంటి సమావేశానికి మోదీ అన్ని పార్టీల ఆందోళనలను వినడానికి ఒక గంట అదనంగా సమాయాన్ని కేటాయించ లేరా? అని ప్రశ్నించారు. పార్టీ సైజుతో సంబంధం లేకుండా ఎన్నికైన ప్రతి ఎంపీకి తన వాక్కును విన్పించే హక్కు ఉందని ఆయన అన్నారు.