జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయ బేస్మెంట్లో రూ.2.31 కోట్లు, కేజీ బంగారం దొరికింది. జైపూర్‌లోని యోజనా భవన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయంలోని బీరువాలో ఫైళ్ల మధ్య సూట్‌కేసు కన్పించింది. తెరచి చూడగా రూ.2.31 కోట్ల నగదు, కేజీ బంగారు బిస్కెట్లు ఉన్నాయి. దీంతో పోలీసులు, ఆదాయపన్ను శాఖలకు సమాచారం అందించారు.
దీనిపై జైపూర్ పోలీస్ అడిషనల్ డైరెక్టర్ మహేశ్ గుప్తా, చీఫ్ సెక్రటరీ ఉషా శర్మ, డీజీపీ, పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ సంయుక్తంగా అర్థరాత్రి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. 8 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా పరిశీలిస్తున్నామని కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు.