Himanshi Narwal | గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Lt Vinay Narwal) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత వినయ్ భార్య హిమాన్షి నర్వాల్ (Himanshi Narwal)పై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) తాజాగా స్పందించింది. ఈ మేరకు ట్రోలర్స్‌పై సీరియస్ అయ్యింది.
ఉగ్రవాదులు వినయ్ నర్వాల్‌ను మతం పేరు అడిగి ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై దేశం మొత్తం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఒక వర్గం వారిని టార్గెట్ చేయొద్దంటూ హిమాన్షి ఇటీవలే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు కొందరికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ మొదలు పెట్టారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తాజాగా స్పందించింది. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న మహిళను విమర్శించడం బాధాకరమని వ్యాఖ్యానించింది. హిమాన్షి అభిప్రాయంపై ట్రోల్స్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు పూర్తిగా ఖండించదగినవని పేర్కొంది. ఏదైనా కామెంట్ చేసేటప్పుడు మర్యాదగా, రాజ్యాంగ సరిహద్దులకు లోబడి వ్యవహరించాలని సూచించింది. జాతీయ కమిషన్ ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల కిందట భారత నౌకాదళంలో చేరారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో పని చేసే అధికారిగా సహచరులు, ఉన్నతాధికారుల నుంచి ఆయన మన్ననలు పొందారు. ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్‌కు పెళ్లి జరిగింది. 19న రిసెప్షన్ తర్వాత హనీమూన్ కోసం ఈ జంట జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. 22న జరిగిన ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీలతో సహా 26 మంది మరణించగా మరికొందరు గాయపడ్డారు.
Also Read..
Military Training | పాక్‌లో మిలిటరీ శిక్షణ పొందిన పెహల్గామ్ ఉగ్రవాదులు..!
PM Modi | పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ
Chenab River | పాక్‌కు చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్ జలాశయం గేట్లు మూసివేత.. VIDEOS