Student Dies Of Cold | చలి దుస్తులు లేక, చలికి తట్టుకోలేక.. స్కూల్ విద్యార్థి మృతి
Student Dies Of Cold | చలి దుస్తులు లేకపోవడంతో చలికి తట్టుకోలేక ప్రేయర్ సమయంలో స్కూల్ విద్యార్థి అపస్మారకంగా పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ విద్యార్థి చలి దుస్తులు ధరించకపోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
పాట్నా: చలి దుస్తులు లేకపోవడంతో చలికి తట్టుకోలేక ప్రేయర్ సమయంలో స్కూల్ విద్యార్థి అపస్మారకంగా పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. (Student Dies Of Cold) ఆ విద్యార్థి చలి దుస్తులు ధరించకపోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాకియాలోని ఆదర్శ ప్రభుత్వ మిడిల్ స్కూల్లో పదేళ్ల మనీష్ కుమార్ ఆరో తరగతి చదువుతున్నాడు. చలి దుస్తులు లేకపోవడంతో వాటిని ధరించకుండా బుధవారం బడికి వచ్చాడు. ప్రార్థన సమయంలో ఉన్నట్టుండి కిందపడిపోయాడు.
కాగా, టీచర్లు వెంటనే ఆ విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆ బాలుడి కుటుంబానికి తెలిపారు. అయితే ఆ విద్యార్థి చనిపోయినట్లు ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. పెద్దగా రోధించడంతో అక్కడ కలకలం రేగింది. ఈ సంగతి తెలిసిన పోలీసులు
ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ బాలుడిని అతడి కుటుంబ సభ్యులు కొట్టారని, దీంతో అతడు భోజనం చేయకుండా, చలి దుస్తులు ధరించకుండా స్కూల్‌కు రావడంతో అస్వస్థతకు గురయ్యాడని జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- cold
- Dies
- school student
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

