న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. (Delhi chokes) ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత స్థాయిలు 400 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో దేశ రాజధాని రెడ్ జోన్లోకి ప్రవేశించింది.
కాగా, ఆదివారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవించే హక్కు తమకు ఉన్నదని నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఇండియా గేట్ వద్ద ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల చర్యపై ఢిల్లీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | Residents of Delhi protest at India Gate, demanding that the government formulate policies to curb air pollution in the National Capital region. pic.twitter.com/Iwxh2np3r5
— ANI (@ANI) November 9, 2025
Also Read:
Watch: బెంగళూరు జైలులో ఖైదీల మందు పార్టీలు, చిందులు.. వీడియోలు వైరల్
Watch: కదులుతున్న కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్