Sunita Kejriwal | బెయిల్ ఆర్డర్ అప్లోడ్ కాకముందే హైకోర్టుకు ఎలా వెళ్తారు..? ఈడీ తీరుపై మండిపడ్డ సునీతా కేజ్రీవాల్
Sunita Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) స్పందించారు.
Sunita Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) స్పందించారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్రయల్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్ వెబ్సైట్లో అప్లోడ్ కాకుముందే ఈడీ హైకోర్టుకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు.
‘అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే.. ఈడీ హైకోర్టును ఎలా ఆశ్రయిస్తుంది..? సీఎం స్థాయిలో ఉన్న నా భర్తను ప్రభుత్వం, కేంద్ర సంస్థలు వాంటెడ్ టెర్రరిస్టులా చూస్తున్నాయి. దేశంలో నియంతృత్వం పెరిగిపోయింది. హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ ( liquor policy case)కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు గురువారం తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టులో సవాల్ చేసింది.
ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జీ ఎస్వీ రాజు వాదించారు. కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది.
Also Read..
Dead Rat | కస్టమర్‌కు షాకింగ్ అనుభవం.. సాంబార్లో చచ్చిన ఎలుక.. VIDEO
Delhi Rain | ఢిల్లీలో తేలికపాటి వర్షం.. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన నగరవాసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

