Dead Rat | కస్టమర్‌కు షాకింగ్ అనుభవం.. సాంబార్లో చచ్చిన ఎలుక.. VIDEO
Dead Rat | అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రముఖ హోటల్ (Ahmedabad Restaurant) దేవి దోసా ఫుడ్ జాయింట్ (Devi Dosa food joint)లో సర్వ్ చేసిన సాంబార్లో చచ్చిన ఎలుక దర్శనమిచ్చింది.
Dead Rat | గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లు, పేరు మోసిన హోటళ్లలో ఆహార నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్, కల్తీ మసాలాలు, ఏ మాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తిస్తున్నారు. ఇక ఇటీవలే ముంబైకి చెందిన ఓ వైద్యుడు ఆర్డర్ చేసుకున్న ఐస్‌క్రీమ్‌లో మనిషి చేతివేలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్ (Ahmedabad Restaurant) దేవి దోసా ఫుడ్ జాయింట్ (Devi Dosa food joint) కు వెళ్లాడు. అక్కడ ఫుడ్ తీసుకోగా.. అతనికి సర్వ్ చేసిన సాంబార్ (Sambar) గిన్నెలో చచ్చిపోయిన ఎలుక (Dead Rat) దర్శనమిచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై సదరు కస్టమర్ అమ్దవద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు సదరు హోటల్ యజమానికి నోటీసులు జారీ చేశారు.
Also Read..
Toxic Alcohol | తమిళనాడులో 47కు చేరిన కల్తీసారా మృతుల సంఖ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

