Vladimir Putin | కిమ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్ చేసిన పుతిన్.. లిమోసిన్‌ను స్వయంగా డ్రైవ్ చేసిన రష్యా అధ్యక్షుడు
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఇటీవలే ఉత్తర కొరియా (North Korea)లో పర్యటించిన విషయం తెలిసిందే. తన పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా అధినేతకు పుతిన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఇటీవలే ఉత్తర కొరియా (North Korea)లో పర్యటించిన విషయం తెలిసిందే. దాదాపు 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలూ ఒకరికొకరు పలు రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు.
తన పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా అధినేతకు పుతిన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. రష్యన్ మేడ్ లిమోసిన్‌ను (Limousine) గిఫ్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ ఈ కారులో సరదాగా డ్రైవ్‌కు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్ కారును స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. పుతిన్ పక్కనే కిమ్ కూర్చొని ఉన్నారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక కిమ్‌కు గిఫ్ట్ చేసిన కారు లిమోసిన్.. రష్యాలోనే తయారైంది. పుతిన్ తన కాన్వాయ్‌లోనూ ఇలాంటి కార్లనే ఉపయోగిస్తున్నారు.
మరోవైపు కిమ్ కూడా పుతిన్‌కు అరుదైన కొరియన్ జాతి శునకాలను (Rare Dogs) గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫుంగ్సన్ జాతికి చెందిన శునకాలను పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కున్న కొండ ప్రాంతాల్లో ఫుంగ్సన్ జాతి శునకాలు నివసిస్తుంటాయి. మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులను కూడా అవి ఢీకొట్టగలవు.
🇷🇺 🇰🇵 President Vladimir Putin driving North Korea’s Kim Jong Un in a brand new Aurus Russian luxury car. pic.twitter.com/N4ceb2ZWvV
— BRICS News (@BRICSinfo) June 20, 2024
Also Read..
Toxic Alcohol | తమిళనాడులో 47కు చేరిన కల్తీసారా మృతుల సంఖ్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

