Mamata Banerjee: కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయకండి.. ప్రధాని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ
Mamata Banerjee: కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని మోదీకి దీదీ లేఖ రాశారు. వాయిదా వేయడం వలన.. ఆ చట్టాలపై పార్లమెంట్లో సమీక్ష నిర్వహించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త చట్టాలు అమలు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: కొత్తగా రూపొందించిన మూడు నేర చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. వాస్తవానికి జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. అయితే వాటి అమలును వాయిదా వేయాలని కోరూతూ దీదీ లేఖ రాశారు. కొత్త నేర చట్టాలను వాయిదా వేయడం వలన.. పార్లమెంట్లో ఆ చట్టాలను సమీక్షించే అవకాశం ఉంటుందని ఆమె తన లేఖలో అభిప్రాయపడ్డారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే బ్రిటీష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1872 నాటిఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకువచ్చారు. దేశ పౌరులకు వేగవంతంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతో ఆ కొత్త చట్టాలను రూపొందించారు. న్యాయ వ్యవస్థను, కోర్టు మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త చట్టాలను తయారు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

