Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ (Rajya Sabha MP) స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్వాతి మలివాల్‌పై వేధింపులకు పాల్పడిన కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) తాజాగా సమన్లు పంపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. స్వాతి మలివాల్ పట్ల కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బిభవ్ కుమార్‌పై కఠిన చర్య తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ‘స్వాతి మలివాల్ సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. డ్రాయింగ్ గదిలో సీఎం కోసం ఎదురుచూస్తుండగా, ఆమెతో పీఎస్ బిభవ్‌కుమార్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం కేజ్రీవాల్‌కు తెలిసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు’ అని ఆయన తెలిపారు.
Also Read..
Hepatitis A | కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఎ వైరస్.. 12 మంది మృతి.. నాలుగు జిల్లాలకు అలర్ట్
Bomb Note | ఢిల్లీ – వడోదర ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
Billboard | పెట్రోల్ పంప్‌పై పడిన భారీ హోర్డింగ్.. షాకింగ్ వీడియో వైరల్