Arvind Kejriwal | న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో తమ పార్టీకి పొత్తు ఉండదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో ఎలాంటి పొత్తు ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఆప్, కాంగ్రెస్ ఈ ఏడాది మొదట్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కలిసి పోటీ చేశాయి. అయితే అక్కడ మొత్తం స్థానాలు బీజేపీ గెలుచుకోవడంతో ఈ రెండు పార్టీలు ఓటమి చవి చూశాయి. అక్టోబర్లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీలు పలు దఫాలు చర్చలు జరిపినా ఒక ఒప్పందానికి రాలేకపోయాయి.