న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ‘అతి విశ్వాసం పనికిరాదని హర్యానా ఎన్నికలు చెబుతున్న అతిపెద్ద గుణపాఠం’ అని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్, ఆప్ మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో 89 స్థానాల్లో ఆప్ తన అభ్యర్థులను నిలబెట్టింది. మంగళవారం న్యూఢిల్లీలో ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మా ట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.