Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై మంగళవారం కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా యమునానదిలో కాలుష్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై హర్యానాలో పోలీసులు కేసు నమోదు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ పార్టీకి చెందిన గుర్తు తెలియని కార్యకర్తలపై హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోని షాహాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, యమునా నదిలో కాలుష్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు.