న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఈడీకి సుప్రీం కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు విచారించింది.
కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉంటే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొన్నది. అయితే, ఈ విషయమై తాము తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం మాత్రం ఇస్తున్నామని ఈడీ తరపు న్యాయవాదికి తెలిపింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం జరిగిన విచారణలో.. ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఈడీని కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.