రాంచీ, మే 11: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ అరెస్టు అయిన భూ ఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈ నెల 9న సంజీత్ కుమార్, మహ్మద్ ఇర్షాద్, తపస్ ఘోష్‌లను కస్టడీలోకి తీసుకొన్నామని తెలిపింది.
భూ రికార్డుల ఫోర్జరీ, ట్యాంపరింగ్ చేయడంలో వీరి పాత్ర ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నది. సంజీత్, ఘోష్‌లు రిజిస్ట్రార్ ఆఫ్ అస్యూరెన్సెస్లో కాంట్రాక్టు ఉద్యోగాలు పని చేస్తున్నారని తెలిపింది. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటి వరకు సొరేన్ సహా 25 మందిని అరెస్టు చేసింది.