CM Siddaramaiah | బెంగళూరు, అక్టోబర్ 3: ముడా భూ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరికొందరు ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు ఫిర్యాదుదారులలో ఒకరైన ప్రదీప్ కుమార్ ఎస్పీ ఆరోపించారు. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కేసులో నిందితుడు సిద్ధరామయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే ఆధారాలను ధ్వంసం చేయవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముడా కమిషనర్‌పై కూడా చర్య తీసుకోవాలని ఆయన కోరారు.