తిరువనంతపురం: ఎన్సీసీ క్యాంపులో పాల్గొన్న కొందరు క్యాడెట్లు భోజనం తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వాంతులు వంటి లక్షణాలతో పలువురు అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎన్సీసీ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆ క్యాంప్‌ను ముట్టించాయి. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ఆర్మీ అధికారిపై దాడి చేశారు. (Army officer assaulted) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. త్రిక్కక్కరాలోని కేఎంఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో ఎన్సీసీ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. 80 మందికి పైగా క్యాడెట్లు ఇందులో పాల్గొన్నారు.
కాగా, డిసెంబర్ 23న సాయంత్రం భోజనం తర్వాత వాంతులు వంటి లక్షణాలతో క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు, స్థానిక బీజేపీ కౌన్సిలర్ ప్రమోద్, ఆయన మద్దతుదారులు రాత్రి వేళ ఎన్సీసీ క్యాంపు ఆవరణలోకి దూసుకెళ్లారు. ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఆర్మీ అధికారిపై ఇద్దరు వ్యక్తులు భౌతికంగా దాడి చేశారు. అయితే ఆ అధికారి సంయమనం పాటించారు. ఇంతలో ఒక పోలీస్ జోక్యం చేసుకున్నారు.
మరోవైపు ఆహారం కలుషితమైనట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్సీసీ క్యాంపు నుంచి ఆహారం, నీటి నమూనాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు. అయితే ఎన్సీసీ క్యాంపులోకి చొరబడి ఆర్మీ అధికారిపై దాడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, దాడికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడాన్ని క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ కర్నైల్ సింగ్ తప్పుపట్టారు. కాగా, ఆర్మీ అధికారిపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
NCC cadets hospitalized due to food poisoning at KMM College, Thrikkakkara—but the horror didn’t end there. Lt Col Karnail Singh was brutally assaulted by Left-backed thugs.
Kerala’s Communist govt has a shameful track record of targeting patriots.
FIR filed, yet no action. pic.twitter.com/v5TDdGDQ4K
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 28, 2024